అల్పపీడనం ఎఫెక్ట్‌..4 రోజుల పాటు వ‌ర్షాలు !

by velandi.Saikiran |

ఇవాళ అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే ఛాన్స్ ఉంద‌ట‌. దీంతో త‌మిళ‌నాడు, శ్రీలంక‌, తెలుగు రాష్ట్రాల‌కు వ‌ర్షాలు ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది.

అల్పపీడనం ఎఫెక్ట్‌..4 రోజుల పాటు వ‌ర్షాలు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రెండు తెలుగు రాష్ట్రాలలో మళ్లీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. దీని ప్రభావంతో తమిళనాడు, శ్రీలంకలో వర్షాలు పడతాయని హెచ్చరించింది.

ఈనెల 19వ తేదీ తర్వాత ఉపరితల ఆవర్తనం ఏర్పడి, అల్పపీడనంగా మారే పరిస్థితిలు కనిపిస్తున్నట్లు వెల్లడించింది వాతావరణ శాఖ. దీంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడతాయని వివరించింది. ఈనెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దాదాపు నాలుగు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడతాయని కూడా స్పష్టం చేసింది వాతావరణ శాఖ. అంటే మొత్తంగా రెండు అల్ప పీడ‌నాలు ఏర్ప‌డే ఛాన్స్ ఉన్న‌ట్లు తెలిపింది వాతావ‌ర‌ణ శాఖ‌.

క్రమంగా తగ్గుతున్న చలి తీవ్రత

రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రమ క్రమంగా చలి తీవ్రత తగ్గుతోంది. శివరాత్రి పూర్తికాగానే చలి తీవ్రత తగ్గుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాయంత్రం కాస్త చల్లగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం విపరీతంగా ఎండలు దంచి కొడుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో 30కి పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు చెబుతున్నారు. ఇక మార్చి మొదటి వారం నుంచే ఈ సారి ఎండలు దంచి కొడతాయని అంచనా వేస్తున్నారు.

Next Story