మామడూరును వణికిస్తున్న చిరుత.. ఆవు దూడను చంపి బీభత్సం

by Vemula.Srinu Prasad |

అనంతపురం జిల్లా మామడూరులో చిరుత భయం పట్టుకుంది. స్థానిక అటవీ ప్రాంతం నుంచి పొలంలో ఉన్న ఆవు దూడపై అమాంతం దాడి చేయడం కలకల రేగింది....

మామడూరును వణికిస్తున్న చిరుత.. ఆవు దూడను చంపి బీభత్సం
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Ananthapuram) మామడూరు(Mamaduru)లో చిరుత(Chirutha) భయం పట్టుకుంది. స్థానిక అటవీ ప్రాంతం(Forest Area) నుంచి పొలం(Forming)లో ఉన్న ఆవు దూడపై అమాంతం దాడి చేయడం కలకల రేగింది. అంతేకాదు చంపి సమీపంలోని చెరువులోకి తీసుకెళ్లింది. దీంతో చిరుత పేరు వెంటనే స్థానికులు గజ గజ వణికిపోతున్నారు. ఆవు కాబట్టి సరిపోయిందని అదే మనుషైతే ఎంత విషాదం చోటు చేసుకుని ఉండేదోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎటు నుంచి వచ్చి తమపైన కూడా దాడి చేస్తోందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులకు ఇప్పటికే సమాచారం అందించామని తెలిపారు.

అయితే తాము చర్యలు తీసుకుంటామని, అప్పటి వరకూ స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారని చెప్పారు. చెరువు సమీపంవైపు ఎవరూ వెళ్లొద్దని, చిరుత పట్ల అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు చెప్పినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. తమ గ్రామానికి సమీపంలో అటవీ ప్రాంతం ఉండటంతో విష పురుగులతో పాటు చిరుతలు సైతం వస్తున్నాయని, వాటి నుంచి తమను రక్షించేందుకు శాశ్వత పరిష్కారం చేయాలని తాము కోరుతున్నట్లు తెలిపారు.

Next Story