పెద్దపులి సంచారంతో హడలిపోతున్న ఆదివాసీలు.. బంధించాలంటూ ఆందోళన

by Vemula.Srinu Prasad |

పోలవరం మన్యంలో పెద్దపులి స్థానిక ఆదివాసీలను హడలెత్తిస్తోంది. పోలవరం మన్యంలో పెద్దపులి స్థానిక ఆదివాసీలను హడలెత్తిస్తోంది....

పెద్దపులి సంచారంతో హడలిపోతున్న ఆదివాసీలు.. బంధించాలంటూ ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: పోలవరం(Polavaram) మన్యం(Manyam)లో పెద్దపులి(Tiger) స్థానిక ఆదివాసీల(Adivasis)ను హడలెత్తిస్తోంది. తాళ్లపాలెం-చొప్పరిపాలెం(Tallapalem-Chopparipalem) అటవీప్రాంతంలో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తుండటంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పొలాలకు, మన్యంలోకి వెళ్లాలంటేనే జంకిపోతున్నారు. పెద్దపులి భయం తట్టుకోలేక రంపచోడవరం(Rampachodavaram)లో ఆందోళనకు దిగారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రతినిధులతో కలిసి ఐటీడీఏ కార్యాలయం ఎదుట బైఠాయించారు. పులిని బంధించి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

అప్రత్తమైన అటవీశాఖ

మరోవైపు పెద్దపులి సంచారం తెలిసిన వెంటనే అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మన్యంలో గస్తీ కాస్తున్నారు. పులిని త్వరగా పట్టుకునేందుకు ఏర్పాట్లు సైతం చేశారు. తాము పెద్దపులి బంధించే వరకూ స్థానిక గిరిజనులు, ఆదివాసీలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పొలాలు, మన్యంలోకి వెళ్లే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, చేతుల్లో కర్రలు పట్టుకుని వెళ్లాలని సూచించారు. అయినా సరే పెద్దపులి ఎటు నుంచి దాడి చేస్తుందోనని గిరిజనులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తమను పులి బారి నుంచి తమకు త్వరగా ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు.

Next Story