జగన్ పర్యటనలో మృతి చెందిన వ్యక్తి కేసులో కీలక మలుపు.. ఢీకొట్టిన వాహనం ఆయనదేనా..?

by Vemula.Srinu Prasad |

జగన్ పర్యటనలో మృతి చెందిన వ్యక్తి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది...

జగన్ పర్యటనలో మృతి చెందిన వ్యక్తి కేసులో కీలక మలుపు.. ఢీకొట్టిన వాహనం ఆయనదేనా..?
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్(Ys Jagan) రెండు రోజుల క్రితం సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల(Renta Palla)లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో ఏటుకూరు బైపాస్ దగ్గర జగన్ కాన్వాయ్‌(Jagan convoy)లోని వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సింగయ్యను ఢీకొట్టింది జగన్ వాహనమేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీ ఫుటేజులను, వాహనం ఢీకొన్న వీడియోలను పోలీసుల క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జగన్ వాహనం కింద పడిన వ్యక్తి అసలు సింగయ్యేనా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ప్రమాదం జరిగిన సమయంలో వీడియోలో ఉన్నవారి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు.

Next Story