- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజధానిలో కీలక ఘట్టం... HOD టవర్ల స్టీల్ డయాగ్రిడ్ పనులు స్టార్ట్
రాజధాని అమరావతిలో HOD టవర్ల విషయంలో కీలక ఘట్టం నమోదు అయింది..

దిశ, వెబ్ డెస్క్: రాజధాని అమరావతి(Amaravati)లో HOD టవర్ల విషయంలో కీలక ఘట్టం నమోదు అయింది. టవర్ -1కు మొదటి స్టీల్ డయాగ్రిడ్‌ను అమర్చే పనులను మంత్రి నారాయణ(Minister Narayana) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయాగ్రిడ్ విధానంలో ప్రభుత్వం ఐదు ఐకానిక్ భవనాలు నిర్మిస్తోందన్నారు. అమరావతిలో జీఏడీ,హెచ్‌ఓడీలకు మొత్తం 5 టవర్లు డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మిస్తున్నామని తెలిపారు. జీఏడీ టవర్ మొత్తం 47 అంతస్తులతో మిగిలిన టవర్లు 40 అంతస్తులతో నిర్మిస్తున్నామని చెప్పారు. మొత్తం 53 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో 5 టవర్లు నిర్మాణం చేస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఒకేచోట ఉండేలా అన్ని టవర్ల నిర్మాణం
‘‘అధికార యంత్రాంగం మొత్తం ఒకేచోట ఉండేలా టవర్ల నిర్మాణం ప్లాన్ చేశాం. ప్రజలకు ఏ అవసరం ఉన్నా ఒకేచోట అన్ని కార్యాలయాలు ఉండేలా డిజైన్ చేశాం. 2028 అక్టోబర్ నాటికి అన్ని టవర్ల నిర్మాణం పూర్తి చేశాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లతో పాటు ప్రైవేట్ సంస్థల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. రైతులకు మాట ఇచ్చిన విధంగా అమరావతి రాజధాని నిర్మిస్తాం.’’ అని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.






