కూటమి నేతల కీలక భేటీ.. డీలిమిటేషన్‌‌పై సుదీర్ఘంగా చర్చ

by Vemula.Srinu Prasad |

అమరావతిలోని సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ, దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై సుదీర్ఘంగా చర్చించారు

కూటమి నేతల కీలక  భేటీ.. డీలిమిటేషన్‌‌పై సుదీర్ఘంగా చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati)లోని సీఎం చంద్రబాబు(Chandrababu)నివాసంలో కూటమి నేతల కీలక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల పునర్విభజన(Delimitation) ప్రక్రియ, దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై సుదీర్ఘంగా చర్చించారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన ఏపీ వంటి రాష్ట్రాలకు రాజకీయంగా అన్యాయం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు.

కూటమి నేతలకు సీఎం దిశానిర్దేశం

కేంద్రం డీలిమిటేషన్ బిల్లును ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై కూటమి నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా రాష్ట్రానికి రావాల్సిన సీట్ల సంఖ్య తగ్గకుండా ఉండాలంటే జాతీయ స్థాయిలో ఏ విధమైన ఒత్తిడి తీసుకురావాలనే దానిపై నేతలు మంతనాలు జరిపారు. కేవలం రాజకీయాలే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే అంశాలపై సమన్వయంతో ముందుకు వెళ్లాలని కూటమి పార్టీలు నిర్ణయించుకున్నాయి. అయితే నియోజకవర్గాల పెంపు కంటే రాష్ట్ర ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండటమే లక్ష్యంగా ప్రభుత్వ స్ట్రాటజీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Next Story