Ap News: మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో కీలక భేటీ.. ఏం చర్చిస్తున్నారంటే..!

by Vemula.Srinu Prasad |

మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరుగుతోంది...

Ap News: మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో కీలక భేటీ.. ఏం చర్చిస్తున్నారంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ఆధ్వర్యంలో కీలక సమావేశం జరుగుతోంది. మంగళగిరి(Mangalagiri) కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి పార్టీ నేతలందరూ హాజరయ్యారు. ఈ సారి కడప(Kadapa)లో టీడీపీ ‘మహానాడు’(Mahanadu) కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో చర్చిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు టీడీపీ పొలిట్ బ్యూర్ సమావేశం(TDP Politburo Meeting) నిర్వహణకునే ఈ కార్యక్రమానికి ముందు ఈ భేటీ జరుగుతుండటంతో ప్రాధాన్యత చోటు చేసుకుంది.

ప్రస్తుతం మీటింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర కమిటీల్లో తీసుకోవాల్సిన కొన్ని కీలక మార్పులకు సంబంధించి సైతం చర్చిస్తున్నారు. పొలిట్ బ్యూరోలో మార్పులు, పార్టీలో ప్రక్షాళన వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. పార్టీలో సమూలంగా మార్పులు చేయాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. ఇందులో భాగంగా కొత్త వారికి, యువకులకు అవకాశం ఇచ్చే నిర్ణయంపైనా ఈ భేటీలో చర్చిస్తున్నారు. ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్ డిటైల్డ్‌గా నేతలతో చర్చిస్తున్నారు. గతంలో మహానాడును మూడు రోజులు పాటు నిర్వహించారు. ప్రస్తుతం రెండు రోజులు మాత్రమే నిర్వహించే యోచనలో ఉన్నారు. ఎన్టీఆర్ జయంతి(Ntr Jayanti) సందర్భంగా మహానాడు(Mahanadu)ను 27, 28, 29 తేదీల్లో ప్రతి ఏడాది నిర్వహిస్తారు. ఈసారి రెండు రోజులు మాత్రమే నిర్వహించాలనే అంశంపై చర్చిస్తున్నారు.

Next Story