లిక్కర్ కేసు నిందితులకు బిగ్ షాక్.. ఈ నెల 13 వరకు జైల్లోనే..!

by Vemula.Srinu Prasad |

లిక్కర్ కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది...

లిక్కర్ కేసు నిందితులకు బిగ్ షాక్.. ఈ నెల 13 వరకు జైల్లోనే..!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో లిక్కర్ కేసు(Liquor Case) సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం జరిగిన ఈ స్కామ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)కి చెందిన కీలక నేతలు సైతం అరెస్ట్ అయి జైలు జీవితం గడుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకూ సిట్ అధికారులు(SIT Officers) మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. విజయవాడ జిల్లా జైలులో 9 మంది, గుంటూరు జిల్లా జైలులో ఇద్దరు, రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే రిమాండ్ గడువు ముగియడంతో వీరందరినీ విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. నిందితులకు మరో 13 రోజుల పాటు రిమాండ్ గడువును పొడిగించింది. ఆగస్టు 13కు విచారణను వాయిదా వేసింది.

కాగా లిక్కర్ స్కామ్ కేసులో అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు రాజ్ కసిరెడ్డి, పైలా దిలీప్, వెంకటేశ్ నాయుడు, బూనేటి చాణక్య, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీథర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. లిక్కర్ కేసులో మరికొంతమంది పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు విచారణను ముమ్మరం చేశారు.

Next Story