వైఎస్ జగన్ పర్యటన ఎఫెక్ట్.... ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి నోటీసులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-30 10:47:46  IST  )

వైఎస్ జగన్ పర్యటన వేళ నెల్లూరు జిల్లాలో కీలక పరిణామం చోటు చేసుకుంది..

వైఎస్ జగన్ పర్యటన ఎఫెక్ట్.... ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్(YS Jagan) పర్యటన వేళ నెల్లూరు జిల్లా(Nellore District)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ పర్యటన జన సమీకరణపై అనుమతులు పరిమితంగా ఇచ్చింది. గత పర్యటనల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారీ సంఖ్యలో కాకుండా కార్యకర్తల సమీకరణకు పరిమితులు విధించింది. అయినా సరే పలువురు కీలక నేతలు వచ్చే అవకాశం ఉందన్న సమచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పలువురు నేతలకు నోటీసులు ఇస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ కు నోటీసులు అందజేశారు. చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసలు.. 30 యాక్ట్ అమల్లో ఉందని, బయటకు రావొద్దని నోటీసులు ఇచ్చారు. దీంతో పోలీసుల తీరుపై చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగన్ పర్యటనపై అక్రమంగా ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డారు. జగన్ టూర్‌లో113 మందికి మించకూడదని వింతగా చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హెలిప్యాడ్ వద్దకు వెళ్లేందుకు 10 మందికే అనుమతివ్వడంపైనా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు కురిపించారు.

Next Story