- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయాలకు టీడీపీ ఎంపీ గుడ్ బై.. త్వరలో..!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది....

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి(Ongole MP Magunta Srinivasula Reddy) రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. త్వరలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు(CM Chandrababu)తో సైతం చర్చించినట్లు ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు బదులుగా కుమారుడు రాఘవరెడ్డి బరిలోకి దిగుతారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చెప్పారు.
కాగా మాగుంట శ్రీనివాసులురెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చారు. 1998, 2004, 2009లో ఒంగోలు ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ నుంచి, 2024లో టీడీపీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. అయితే తన కుమారుడి సైతం రాజకీయాల్లో తీసుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాలకు ఆయన గుడ్ బై చెప్పనున్నారు.






