- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టేట్ పాలిటిక్స్‌లో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ
రాష్ట రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన రాజీనామాను మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు (Moshenu Raju) ఆమోదించడం లేదని తాజాగా ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ (MLA Jayamangala Venkataramana) రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు (AP High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని మండలి చైర్మన్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ఈ క్రమంలోనే చైర్మన్ తరఫు లాయర్ మాట్లాడుతూ.. తమకు కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని అభ్యర్థించారు.
కాగా, వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన జయ మంగళ వెంకటరమణ గతేడాది నవంబర్ 23న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ శాసన మండలి చైర్మన్ మోషేన్‌రాజుకు లేఖను అందజేశారు. కానీ, 9నెలలు గడుస్తున్నా దానిని ఆమోదించడం కానీ, తిరస్కరించడం కానీ చేయడం లేదని జయమంగళ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏపీ శాసనసభ కార్యకలాపాల నిర్వహణ విధానంలోని నిబంధన 186, ఆర్టికల్ 190(3)బీ ప్రకారం రాజీనామా సమర్పించాక దానిని ఆమోదించాలి లేక తిరస్కరించడం గానీ చేయాల్సిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న చైర్మన్‌పై ఉందని పిటిషన్‌లో జయ మంగళ వెంకటరమణ పేర్కొన్నారు.






