నెల్లూరు రాజకీయాల్లో కీలక పరిణామం.. మేయర్‌ స్రవంతి రాజీనామా

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-14 02:00:15  IST  )

నెల్లూరు (Nellore) పాలిటిక్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

నెల్లూరు రాజకీయాల్లో కీలక పరిణామం.. మేయర్‌ స్రవంతి రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు (Nellore) పాలిటిక్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మేయర్‌ పొట్లూరి స్రవంతి (Potluri Sravanthi) తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ఈ నెల 18న అవిశ్వాస తీర్మాన ప్రవేశపెట్టనున్న క్రమంలో ఆమె తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 54 మంది కార్పొరేటర్లు ఉండగా.. అందులో అంతా వైసీపీ (YCP)కి చెందిన వారే ఉన్నారు. వారిలో ఒకరు ఇప్పటికే రాజీనామా చేశారు. మేయర్‌ కాకుండా.. మిగిలిన 52 మందిలో 42 మంది సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ(TDP)లో చేరారు.

దీంతో శనివారం రాత్రి స్రవంతి మీడియా ఎదుట రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ కలెక్టర్‌ను కలిసి రాజీనామా లేఖను అందజేయనున్నారు. మేయర్ రాజీనామా ఆమోదం పొందితే.. అవిశ్వాసానికి అవకాశం ఉండదు. ఎన్నికల కమిషన్ అనుమతితో మేయర్ ఎన్నికను నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మేయర్ స్రవంతి మంత్రి నారాయణ, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఐదుగురు కార్పొరేటర్లు వైసీపీలో చేరితే వారిని బెదిరించారని అన్నారు.

Next Story