- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాధాగాయత్రి కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌కు నోటీసులు
విశాఖ టేకీ రాధాగాయత్రి కేసులో కీలక పరిణామం చేసుకుంది. డెహ్రాడూన్‌లోని మసూరీలో ఆమె అనునాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా రాధా గాయత్రి భర్త శ్రీచరణ్‌కు డెహ్రాడూన్ డిప్యూటీ మెజిస్ట్రేట్ నోటీసులు జారీ చేశారు. ..

దిశ, వెబ్ డెస్క్: విశాఖ టేకీ రాధాగాయత్రి కేసు(Visakha Teki Radha Gayatri Case)లో కీలక పరిణామం చేసుకుంది. డెహ్రాడూన్‌లోని మసూరీలో ఆమె అనునాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా రాధా గాయత్రి భర్త శ్రీచరణ్(Sricharan)కు డెహ్రాడూన్ డిప్యూటీ మెజిస్ట్రేట్(Dehradun Deputy Magistrate) నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17న తమ ఎదుట విచారణకు రావాలని ఆదేశించారు. డెహ్రాడూన్ డిప్యూటీ మెజిస్ట్రేట్ ఆనంద్ పేరుతో నోటీసులు జారీ చేశారు. శ్రీచరణ్‌తో పాటు అతడి తల్లిదండ్రులు, సోదరికి కూడా హాజరుకావాలని సూచించారు. ఈ విచారణకు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. లేనిపక్షంలో ఏకపక్ష విచారణ కొనసాగిస్తామని హెచ్చరించారు.
జరిగిందిదీ...
కాగా మసూరీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రాధా గాయత్రి కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. మసూరీ డివిజనల్ మెజిస్ట్రేట్ నేతృత్వంలో సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. జూన్ 14, 16 మధ్య మసూరీలోని హోంస్టేలో జరిగిన పరిణామాలపైనా అధికారులు ఆరా తీశారు. రాధా గాయత్రికి పోస్టుమార్టం నిర్వహించిన సిబ్బందిని సైతం ప్రశ్నించారు.






