- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల కల్తీ నెయ్యి కేసు.. పోలీస్ కస్టడీకి నలుగురు నిందితులు
తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది..

దిశ, వెబ్ డెస్క్: తిరుమల కల్తీ నెయ్యి కేసు(Tirumala adulterated ghee case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులను పోలీస్ కస్టడీ(Police Custody)కి ఇస్తూ తిరుపతి రెండో అదరనపు మున్సిఫ్ కోర్టు(Tirupati Second Court of Munsif) అనుమతించింది. ఈ కేసులో మరింత విచారణ కోసం నిందితులను ఐదు రోజులు పాటు కస్టడీకి ఇవ్వాలన్న సిట్ పోలీసుల అభ్యర్థనకు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వారిని ఐదు రోజుల పాటు పోలీసులు ప్రశ్నించనున్నారు.
కాగా తిరుమలలో కల్తీ నెయ్యి ఘటన సంచలన రేపిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల ప్రకారం ఈ కేసును సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ అధికారులు విచారణ చేపట్టారు. తిరుపతి, తిరుమలలో పలు ప్రాంతాల్లో పలువురిని విచారించారు. గతంలో నెయ్యి సరఫరా చేసిన డెయిరీలకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశ పెట్టడంతో న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ప్రస్తుతం వీరిని మరింతగా విచారించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతించడంతో నిందితులను కస్టడీకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read..






