తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ఆ అధికారి నోటీసులివ్వడంపై హైకోర్టు అభ్యంతరం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-20 10:59:20  IST  )

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది...

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ఆ అధికారి నోటీసులివ్వడంపై హైకోర్టు అభ్యంతరం
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ(Ycp) హయాంలో తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం(Tirumala adulterated ghee affair) తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును ప్రస్తుతం సిట్(SIT) దర్యాప్తు చేస్తోంది. సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు సీబీఐ బృందం(Cbi Team)లోని అధికారులు కేసును విచారిస్తున్నారు. తిరుమల(Tirumala)తో పాటు నెయ్యి సరఫరా చేసిన సంస్థల యాజమానులను ఈ బృందం విచారించింది. పలువురు నిందితులను, సాక్షులను సైతం ఇప్పటికే ప్రశ్నించారు.

అయితే వీరికి సిట్ అధికారి వెంకట్రామయ్య నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో హైకోర్టు పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ జరిగింది. ఈ సందర్బంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ దర్యాప్తు అధికారి వెంకట్రావు నియామకంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌లో వెంకట్రావు భాగం కాదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు అనుమతి తీసుకోకుండా సాక్షులకు నోటీసులు జారీ చేయడం థిక్కరణే అవుతుందని తెలిపింది. దర్యాప్తు అధికారిగా వెంకట్రావును నియమిస్తూ సీబీఐ డైరెక్టర్ ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా ఉండాల్సిందని, సీబీఐ సిట్ అధికారి హోదాలో సాక్షులకు, నిందితులకు వెంకట్రావు నోటీసులు ఇవ్వకుండా నిరోధించింది. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది.

Next Story