- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయేషా మీరా అవశేషాలకు అంత్యక్రియలు చేయండి: సీబీఐ కోర్టు కీలక ఉత్తర్వులు
విజయవాడ లో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయేషా మీరా అవశేషాలకు అంత్యక్రియలు నిర్వహించాలని సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది..

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో సంచలనం రేపిన ఆయేషా మీరా(Ayesha Meera) హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ(Cbi) అధికారుల దర్యాప్తులో రీ పోస్టుమార్టం కోసం 2019లో తెనాలి కబరిస్తాన్‌లో ఆయేషా మీరా అవశేషాలకు బయటకు తీసిన విషయం తెలిసిందే. అయితే ఆయేషా మీరా అవశేషాలకు అంత్యక్రియలు(Funeral) నిర్వహించాలని సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27న అంత్యక్రియలు జరిపించాలని ఆదేశించింది.
అయితే ఈ కేసులో ఫైనల్ రిపోర్టుతో ముస్లిం మత సంప్రదాయాలకు విరుద్ధమైనా మత పెద్దలను ఒప్పించి ఆయేషా శరీర ఆవశేషాలకు వెలికితీశారు. మత ఆచారాల మేరకు అంత్యక్రియలు నిర్వహించాలని, అంతేకాదు ఆ ప్రక్రియను రికార్డు చేసి ఆ రిపోర్టును కోర్టు సమర్పించాలని ఆదేశించింది. ఫిబ్రవరి 27న సీబీఐ కోర్టుకు తల్లిదండ్రులు కోర్టుకు హాజరుకావాలని, ఆయేషా మీరా అవశేషాలకు పోస్టుమార్టం జరిపి భద్రతతో అంత్యక్రియలు నిర్వహించాలని సీబీఐ కోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తమ కుమార్తె హత్య కేసులో రీ పోస్టుమార్టం కోసం ఆయేషా అవశేషాలు బయటకు తీశారని, ఆ తర్వాత తమకు అప్పగించలేదని ఆమె తల్లిదండ్రులు చాలా కాలంగా న్యాయం పోరాటం చేశారు. తమ కుమార్తె హత్య కేసుపై ఇకపై తాము న్యాయ పోరాటం చేయమని ఇప్పటికే తల్లిదండ్రులు ప్రకటించారు.






