Kidney Case: గ్లోబల్‌ ఆస్పత్రి సీజ్

by Vemula.Srinu Prasad |

అన్నమయ్య జిల్లా మదనపల్లి కిడ్నీ కేసులో కీలక పరిణామా చోటు చేసుకుంది..

Kidney Case:  గ్లోబల్‌ ఆస్పత్రి సీజ్
X

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా మదనపల్లి కిడ్నీ కేసు(Madanapalle kidney case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టు ఉత్తర్వులతో గ్లోబల్‌ ఆస్పత్రి(Global Hospital)ని అధికారుల సీజ్ చేశారు. అంతకుముందుకు రెవెన్యూ, వైద్యశాఖ అధికారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం పంచనామా నిర్వహించి సీజ్ చేశామని డీఎస్పీ తెలిపారు.

కాగా గత నెలలో మదనపల్లి గ్లోబల్ ఆస్పత్రిలో కిడ్నీ ఆపరేషన్(Kidney operation) వికటించి మహిళ మృతి చెందారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. దీంతో ఆస్పత్రిని సీజ్ చేసేందుకు పోలీసులు కోర్టును అనుమతి కోరారు. విచారణ చేపట్టిన ధర్మాసనం.. గ్లోబల్ ఆస్పత్రిని సీజ్ చేసేందుకు అనుమతించింది. ఈ మేరకు గురువారం చర్యలు చేపట్టారు.

Next Story