- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ఏ52 నిందితుడు అరెస్ట్
లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ-52 నిందితుడు ప్రణయ్ ప్రకాశ్‌ను విజయవాడ సిట్ అధికారులు ఉత్తర్‌ప్రదేశ్‌లో అరెస్టు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ స్కాం కేసు(Liquor Scam Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ-52 నిందితుడు(Accused) ప్రణయ్ ప్రకాశ్‌ను విజయవాడ సిట్ అధికారులు(Vijayawada Sit Offices) ఉత్తర్‌ప్రదేశ్(Uttarapradesh)లో అరెస్టు చేశారు. ప్రస్తుతం అక్కడి నుంచి విజయవాడ తీసుకొస్తున్నారు. గురువారం విజయవాడ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని సమాచారం. కాగా 2019-24లో మద్యం అమ్మకాలను ప్రభుత్వమే చేపట్టింది. అయితే అమ్మకాల్లో జరిగిన లావాదేల్లో అక్రమాలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కేసును సిట్ కు అప్పగించారు. విచారణ చేపట్టిన సిట్ అధికారులు.. వైసీపీకి చెందిన కీలక వ్యక్తులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పలువురు ఇప్పటికే బెయిల్ పై విడుదలయ్యారు. మరికొందరు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా మరో నిందితుడి అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది.






