మద్యం కేసులో జులై 2న కీలక ఉత్తర్వులు

by Vemula.Srinu Prasad |

లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.....

మద్యం కేసులో జులై 2న కీలక ఉత్తర్వులు
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ స్కాం కేసు(Liquor Scam Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి(Dhanunjay Reddy, Krishnamohan Reddy) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. జులై 2న ఉత్తర్వులు ఇస్తామని విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada ACB Court) స్పష్టం చేసింది. కాగా వైఎస్ జగన్(Ys Jagan) హయాంలో రాష్ట్రంలో విక్రయించిన మద్యానికి సంబంధించి అవకతవకలు జరిగాయని సీఐడీ పోలీసులు(CID Police) కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం నిందితులిద్దరూ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు వీరు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తాజాగా కోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో ధర్మాసనం ఉత్తర్వులపై ప్రస్తుతం నిందితుల్లో ఉత్కంఠ నెలకొంది.

Next Story