- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైకోర్టులో లిక్కర్ కేసు విచారణ.. తీర్పు రిజర్వ్
లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసు(liquor case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్ బెయిల్ ఉత్తర్వులను హైకోర్టులో సిట్ సవాల్ చేసింది. అయితే ఏసీబీ కోర్టు(Acb Court) వీరికి ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. దీంతో సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు శుక్రవారం విచారణ జరిగింది.
ఏ7గా ముప్పిరెడ్డి అవినాశ్ మధ్యంతర, ముందస్తు బెయిల్ పైనా వాదనలు కొనసాగాయి. దీంతో రెండు వర్గాలు వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని, అలాగే తనకు ప్రొటెక్షన్ కల్పిస్తే లొంగిపోతామని కోర్టుకు అవినాశ్ తరపు న్యాయవాదులు తెలిపారు. అయితే అవినాశ్ పారిపోయి విదేశాల్లో ఉంటున్నారని, ప్రొటెక్షన్ ఇవ్వొద్దని అటు కోర్టును సిట్ కోరింది.
మరోవైపు ఇదే కేసులో నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. గోవింద మాల ధరించడానికి అనుమతించాలని కోరారు. ప్రతి సంవత్సరం మాల ధరిస్తానని వివరించారు. ఇందుకు అభ్యంతరాలు ఉంటే ఫైల్ చేయాలని జడ్జి ఆదేశించారు. ఈ మేరకు సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో చెవిరెడ్డి గోవింద మాల అనుమతిపై ఫైలు దాఖలు అయింది.






