డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసు: అనంతబాబు భార్యకు హైకోర్టు కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణకు రావాలని అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది...

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసు: అనంతబాబు భార్యకు హైకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణకు రావాలని అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లక్ష్మీదుర్గ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తనపై రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన వారెంట్‌ను రద్దు చేయాలని ఆమె కోరారు. అయితే ఈ పిటిషన్ విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. ఈనెల 16 నుంచి 30 వరకు దర్యాప్తు అధికారుల ముందు హాజరుకావాలని సూచించింది. ఈనెల 30న ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

కాగా సుబ్రహ్మణ్యం అనంతబాబు వద్ద కారు డ్రైవర్‌గా సుబ్రహ్మణ్యం పని చేశారు. అయితే సుబ్రహ్మణ్యం దారుణ హత్యకు గురయ్యారు. కారుతో సహా డెడ్ బాడీని సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద వదిలివెళ్లారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అనంతబాబును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే బెయిల్ మంజూరు కావడంతో అనంతబాబు జైలు నుంచి విడుదలయ్యారు. ఇక ఇదే కేసులో అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈమేరకు పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారు. కోర్టుకు హాజరకావాలని రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో లక్ష్మీదుర్గ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది.

Next Story