నకిలీ మద్యం కేసులో నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-19 13:11:56  IST  )

నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల రిమాండ్‌ గడువును ఎక్సైజ్ కోర్టు ఈనెల 5 వరకు పొడిగించింది....

నకిలీ మద్యం కేసులో నిందితులకు రిమాండ్‌ పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల రిమాండ్‌ గడువును ఎక్సైజ్ కోర్టు ఈనెల 5 వరకు పొడిగించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్న నిందితులు తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం నిందితుల రిమాండ్ పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది. కాగా ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా 10 మంది నిందితులు విజయవాడ, నెల్లూరు, మదనపల్లె జైలులో ఉన్నారు. వీరందరీని న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. అయితే ఇదే కేసులో బెయిల్ ఉన్న మరో 12 మంది నిందితులు కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు జోగి రమేశ్, జోగి రాము ఈ విచారణకు హాజరుకాకుండా గైర్హాజరు పిటిషన్‌ను దాఖలు చేశారు.

Next Story