- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం.. ఐదుగురు నిందితులకు కస్టడీ
నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ...

X
దిశ, వెబ్ డెస్క్: నకిలీ మద్యం(Fake Liquor) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా ములకలచెరువు(MulakaCheruv)లో నకిలీ మద్యం తయారీ చేస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు మరింత లోతుగా విచారించాలని భావించారు. ఈ మేరకు ఏడుగురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని తంబల్లపల్లి కోర్టు(Tamballapalli Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఐదుగురు నిందితులను మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో మదనపల్లె సబ్ జైలు(Madanapalle Sub Jail)లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఏ1 అద్దేపల్లి జనార్దన్ రావు, ఏ26 జగన్మోహన్ రావు, ఏ28 తాండ్ర రమేశ్, ఏ27 తిరుమల శెట్టి శ్రీనివాసరావును ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు.
Next Story






