రాష్ట్రంలో సంచలనం.. ఆయేషా మీరా తల్లిదండ్రులకు సీబీఐ కోర్టు నోటీసులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-12 09:36:31  IST  )

ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...

రాష్ట్రంలో సంచలనం.. ఆయేషా మీరా తల్లిదండ్రులకు సీబీఐ కోర్టు నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఆయేషా మీరా హత్య కేసు(Ayesha Meera murder case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయేషా తల్లిదండ్రులకు సీబీఐ కోర్టు(CBI Court) నోటీసులు జారీ చేసింది. మీరా హత్య కేసు నిందితుడు సత్యంబాబు(Accused Satyam Babu)పై 376, 302 సెక్షన్లు నమోదు చేసింది. అయితే ఈ కేసుపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని నోటీసుల్లో పేర్కొంది. ఇక ఇదే కేసులో సత్యంబాబు ఇప్పటికే నిర్దోషిగా విడుదలయ్యారు. విచారణ ముగిసినట్టు సీబీఐ తుది నివేదిక సమర్పించింది. అభ్యంతరాలు ఉంటే ఈ నెల 19న తెలపాలని ఆయేషా తల్లిదండ్రులకు జారీ చేసిన నోటీసుల్లో సీబీఐ కోర్టు తెలిపింది.

కాగా 17 ఏళ్ల ఆయేషా మీరా 2007, డిసెంబర్ 27న విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలో దారుణ హత్యకు గురయ్యారు. తను ఉంటున్న హాస్టల్ బాత్రూంలో రక్తపుమడుగులో పడి ఉన్నారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... తొమ్మిది నెలల తర్వాత సత్యంబాబును అరెస్ట్ చేశారు. 2010లో దోషిగా నిర్దారించారు. కానీ ఆధారాలు లేకపోవడంతో 2017లో సత్యంబాబును నిర్దోషిగా విడుదలయ్యారు. అయితే ఇదే కేసుపై పలు పిల్‌లు దాఖలయ్యాయి. వీటితో పాటు ఆయేషా తల్లిదండ్రులు సైతం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని కోరారు. దీంతో కేసును 2018లో న్యాయమూర్తి సీబీఐకి అప్పగించారు. అప్పటి నుంచి సీబీఐ అధికారులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో 260 మంది సాక్షులను విచారించారు.అప్పట్లో కేసు దర్యాప్తు చేసిన పోలీసులను, కాలేజీ హాస్టల్ విద్యార్థులను పిలిచి ప్రశ్నించారు. ఆయేషా అస్తికలను రీ పోస్టుమార్టం చేశారు. డీఎన్‌ఏ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ కేసు దర్యాప్తు ముగియడంతో కోర్టుకు నివేదిక సమర్పించారు. దీంతో ఆయేషా మీరా తల్లిదండ్రులకు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది.

Next Story