ఆయేషా అవశేషాలకు అంత్యక్రియలు.. గుంటూరు ఎస్పీకి సీబీఐ లేఖ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-25 09:06:28  IST  )

ఆయేషా మీరా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయేషా అవశేషాలకు అంత్యక్రియలు నిర్వహించాలని గుంటూరుఎస్పీతో పాటు తెనాలి ఎమ్మార్వోకు సీబీఐ లేఖ రాసింది. ..

ఆయేషా అవశేషాలకు అంత్యక్రియలు.. గుంటూరు ఎస్పీకి సీబీఐ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: ఆయేషా మీరా కేసు(Ayesha Meera case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయేషా అవశేషాలకు అంత్యక్రియలు నిర్వహించాలని గుంటూరు(Guntur) ఎస్పీతో పాటు తెనాలి(Tenali) ఎమ్మార్వోకు సీబీఐ లేఖ రాసింది. ముస్లిం సంప్రదాయం ప్రకారం తెనాలి చెంచుపేట ఖబరస్తాన్‌(Tenali Chenchupet Khabarastan)లో ఈ నెల 27న ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. కాగా కేసు పునర్విచరణ నేపథ్యంలో 2019లో ఆయేషా మీరా అవశేషాలను సీబీఐ(Cbi) వెలికితీసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణను క్లోజ్ చేసింది. దీంతో ఆయేషా అవశేషాలకు అంత్యక్రియలు నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రక్రియపై సీబీఐ అధికారులు గుంటూరు ఎస్పీ, తెనాలి ఎమ్మార్వోకు లేఖ రాశారు. దీంతో ఆయేషా మీరా అవశేషాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది.

Next Story