ఆయేషా మీరా కేసులో కీలక పరిణామం.. CBI రిపోర్టుపై తల్లిదండ్రుల అభ్యంతరాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-18 10:06:17  IST  )

ఆయేషా మీరా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టుకు CBI ఇచ్చిన రిపోర్టుపై తల్లిదండ్రులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కేసును స్వయంగా విచారణ జరిపించుకుంటారా అని ఆయేషా తల్లిదండ్రులను న్యాయమూర్తి అడిగారు...

ఆయేషా మీరా కేసులో కీలక పరిణామం.. CBI రిపోర్టుపై తల్లిదండ్రుల అభ్యంతరాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆయేషా మీరా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టుకు CBI ఇచ్చిన రిపోర్టుపై తల్లిదండ్రులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కేసును స్వయంగా విచారణ జరిపించుకుంటారా అని ఆయేషా తల్లిదండ్రులను న్యాయమూర్తి అడిగారు. తమ దగ్గర డబ్బులు లేవని ఆయేషా తల్లిదండ్రులు తెలిపారు. 19 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా న్యాయం జరగలేదని చెప్పారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. సిట్టింగ్‌ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, సీబీఐ దర్యాప్తు సరిగా జరగలేదని ఆయేషా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా 2007 డిసెంబర్ 27న విజయవాడ ఇబ్రహీంపట్నం శ్రీదుర్గా లేడీస్ హాస్టల్ లో అయేషామీరాపై అత్యాచారం చేసి హత్య చేశారు. బాత్ లో కత్తిపోట్లతో ఆయేషా నగ్న మృతదేహం పడి ఉంది. తన ప్రేమను కాదన్నందుకే ఈ గతి పట్టించానని హంతకుడు లేఖ వదిలివెళ్లారు. అప్పటి నుంచి కూడా ఈ కేసు దర్యాప్తు జరిగింది. ఈ కేసులో సత్యంబాబును అరెస్ట్ చేశారు. అయితే కోర్టు నిర్దోషిగా తీర్పు ఇచ్చింది. దీంతో సత్యంబాబు జైలు నుంచి విడుదల అయ్యారు. దీంతో కేసు మళ్లీ మొదటి వచ్చింది. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగూతనే ఉంది. సీబీఐ సైతం తన రిపోర్టును కోర్టుకు సమర్పించింది. ఈ రిపోర్టుపై ఆయేషా మీరా తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం

Next Story