మద్యం కేసులో కీలక పరిణామం.. విచారణకు మాజీ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి

by Vemula.Srinu Prasad |

ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...

మద్యం కేసులో కీలక పరిణామం.. విచారణకు మాజీ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ(Excise Department Former Special Secretary Rajat Bhargava) హాజరయ్యారు. గత ప్రభుత్వంలో ఆయన ఎక్సైజ్ శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు. ఐదేళ్ల పాటు ప్రభుత్వం షాపుల ద్వారా మద్యం అమ్మకాలు జరిగాయి. అయితే మద్యం అమ్మకాల్లో చాలా అవకతవకలు జరిగాయని, డిజిటల్ పేమెంట్లు చేయనివ్వలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో టీడీపీ, జనసేన నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యం అమ్మకాల్లో జరిగిన అవకతవకలను బయటకు తీయిస్తామని చెప్పారు.

రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికలకు ముందు చెప్పినట్లుగా మద్యం కేసుపై ఫోకస్ పెట్టారు. సిట్ అధికారులకు పూర్తి ఆదేశాలు ఇచ్చారు. దీంతో సిట్ అధికారులు ఈ కేసును వేగంగా విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మిగిలిన నిందితులు, అనుమానితులు, సాక్ష్యులను విచారిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా రజత్ భార్గవను విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు ఆయన సిట్ అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యారు. దీంతో సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విచారణ అనంతరం జరిగే పరిణామాలను చూడాల్సి ఉంది.

Next Story