- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆర్డర్స్ రిజర్వ్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.....

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు(Ap Liquor Scam Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి(MP Mithun Reddy) నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు(High Court)లో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు మిథున్ రెడ్డి బెయిల్‌పై ఆర్డర్స్ రిజర్వ్ చేసింది.
కాగా జగన్ ప్రభుత్వం(Jagan Govt ) హయాంలో మద్యం కుంభకోణం(Liquor Scandal)లో జరిగిందని సిట్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(Chevireddy Baskar Reddy)తో పాటు పలువురు కీలక నేతలు అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉన్నారు. అయితే ఇదే కేసులో మిథున్ రెడ్డిపైనా ఆరోపణలు ఉన్నాయి. తనను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోరుతున్నారు. ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించారు.






