- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అగ్రిగోల్డ్ స్కాంలో కీలక పరిణామం.. ఆస్తులు అప్పగించే ప్రక్రియ షురూ
అగ్రిగోల్డ్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది..

దిశ, వెబ్ డెస్క్: అగ్రిగోల్డ్ స్కాం(Agrigold Scam)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను అప్పగించే ప్రక్రియ ప్రారంభమైంది. అగ్రిగోల్డ్‌కు చెందిన రూ. 3,339 కోట్ల ఆస్తుల(Assets)ను గతంలో ఈడీ(Enforecement Directorate) సీజ్ చేసింది. ఇప్పుడు ఈ ఆస్తుల విలువ మార్కెట్ ప్రకారం రూ.6వేల కోట్లకు చేరాయి. అయితే ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసుపై ఈడీ విచారణ చేపట్టింది.
స్థిరాస్తి వ్యాపారం పేరుతో అగ్రిగోల్డ్ సంస్థ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒడిశా, అండమాన్, నికోబార్ దీవుల్లోనూ పెద్ద ఎత్తున డిపాజట్లు వసూలు చేసింది. అనంతరం మోసాలకు పాల్పడింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో సీఐడీ కేసులు నమోదు అయ్యాయి. అయితే బినామీల పేరుతో అగ్రిగోల్డ్ సంస్థ రూ.వేల కోట్ల విలువైన ఆస్తులను దాచుకుంది. అంతేకాదు డిపాజిట్లకు సంబంధించిన నిధులు కూడా మళ్లించారు. ఈ మేరకు ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది.
మొత్తం 19 లక్షల మంది నుంచి 32 లక్షల ఖాతా ద్వారా డిపాజిట్లు సేకరించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ డిపాజిట్ల వసూళ్ల కోసం అగ్రిగోల్డ్ 130 సంస్థలను స్థాపించినట్లు తేలింది. ఈ సంస్థకు అవ్వా వెంకటరామారావు సారథ్యం వహించారు. డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన డబ్బులను విద్యుత్తు, పాడి, వినోద, ఆరోగ్య పరిశ్రమల వంటి వాటికి మళ్లించారని వెల్లడించింది. ఇందుకోసం వేల మందిని ఏజెంట్లుగా నియమించి మొత్తం రూ.6.380 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు ఈడీ దర్యాప్తులో తెలింది. దీంతో రూ. 3,339 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. తాజాగా ఈ ఆస్తులను అప్పగించాలని ఈడీ నిర్ణయించింది. ఈ మేరకు ప్రక్రియను ప్రారంభించింది.






