- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిట్ దూకుడు.. జైల్లోనే చెవిరెడ్డికి విచారణ
కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది

దిశ, వెబ్ డెస్క్: కల్తీ నెయ్యి కేసు(Adulterated Ghee Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(YSRCP leader Chevireddy Bhaskar Reddy)ని జైలులో సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ అధికారులు విచారించారు. నెయ్యి కాంట్రాక్ట్ మార్పుతో పాటు పలు అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. నెయ్యి కాంట్రాక్ట్ మార్పు నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, సంబంధిత వ్యక్తులతో జరిగిన చర్చలపై ఆరా తీశారు. దాదాపు 2 గంటల పాటు చెవిరెడ్డిని అధికారులు ప్రశ్నించారు. విచారణ ముగియడంతో అధికారులు జైలు నుంచి వెళ్లిపోయారు.
కాగా జగన్ ప్రభుత్వం హయాంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పని చేశారు. ఆ సమయంలో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ జరగడం, ఆ తర్వాత నకిలీ మద్యం స్కాం జరిగినట్లు ప్రస్తుత కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కేసులు నమోదు చేసి సిట్ అధికారులతో విచారిస్తోంది. ఇప్పటికే నకిలీ మద్యం స్కాం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు సైతం జైలుకు వెళ్లారు. ఈ కేసులో పలువురు బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్న వేళ.. కల్తీ నెయ్యి కేసులో సీబీఐ బృందంలోని సిట్ అధికారులు మరింతగా విచారించేందుకు కోర్టు అనుమతి తీసుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సోమవారం జైల్లోనే ప్రశ్నించారు.






