- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజకీయాల్లో కీలక పరిణామం.. చిన్నరాజప్పతో ముద్రగడ భేటీ
by Vemula.Srinu Prasad |
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాల్లో(Ap Politics) కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప(Tdp Mla Chinarajappa)తో ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) భేటీ అయ్యారు. గతంలో ముద్రగడ పద్మనాభం అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ముద్రగడను కలిసేందుకు చినరాజప్ప ఆస్పత్రికి వెళ్లారు. కానీ వైద్యుల సూచన మేరకు కలవలేక పోయారు. ఈ విషయం తెలుసుకున్న ముద్రగడ పద్మనాభం చినరాజప్పను కలవాలనుకున్నారు. ఈ మేరకు ఆదివారం పెద్దాపురంలోని చినరాజప్ప క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. తాను ఆస్పత్రిలో ఉన్నసమయంలో కలవడానికి వచ్చినందుకు చిన్నరాజప్పకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇరువురి మధ్య సాధారణ కుటుంబ, ఆరోగ్య విషయాలపై చర్చించుకున్నారు.
Next Story






