పరకామణి కేసు.. నిందితుడి ఆస్తులపై హైకోర్టుకు ఏసీబీ మధ్యంతర నివేదిక

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-26 12:20:33  IST  )

తిరుమల పరకామణిలో జరిగిన చోరీ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది...

పరకామణి కేసు..  నిందితుడి ఆస్తులపై హైకోర్టుకు ఏసీబీ మధ్యంతర నివేదిక
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల పరకామణి(Tirumala Parakamani)లో జరిగిన చోరీ కేసు(Theft Case)లో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. చోరీ నిందితుడు రవికుమార్ సహా కుటుంబ ఆస్తులపై ఏపీ హైకోర్టు(AP High Court)లో విచారణ జరిగింది. దీంతో ఏసీబీ అధికారులు(ACB officials) తమ మధ్యంతర నివేదికను కోర్టుకు సమర్పించారు. నిదికను పరిశీలన చేసి ఆ తర్వాత ఉత్తర్వులు ఇస్తామని కోర్టు తెలిపింది. ఎఫ్ఐఆర్(FIR) నమోదు అంశాన్ని పరిశీలించాలని సీఐడీ(CID)ని ఆదేశించింది.

కాగా జగన్ ప్రభుత్వ(Ys Jagan) హయాంలో తిరుమల పరకామణి(Tirumala Parakamani)లో చోరీ జరిగింది. విదేశీ కరెన్సీ లెక్కిస్తూ అందులోకి కొన్ని నోట్లను రవికుమార్ కొట్టేశారు. అప్పటి ఏవీఎస్వో సతీశ్ కుమార్(AVSO Satish Kumar) గుర్తించి రవికుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాదాపు 900 డాలర్లు అపహరించారని, వాటి విలువ రూ.72 వేలు ఉంటాయని పేర్కొన్నారు. అలా కొట్టేసిన డబ్బుతో రవికుమార్ చాలా ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే అప్పటి వైసీపీ నాయకులు ఈ కేసును రాజీ చేయించారు. రవికుమార్ తో పాటు ఆయన భార్యపై ఉన్న ఆస్తులను టీటీడీకి రాయించారు. అలా లోక్‌అధాలత్‌లో కేసును కొట్టేయించారు.

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ చేయించింది. ఈ ఎంక్వైరీలో ఏవీఎస్వో సతీశ్ కుమార్ చాలా కీలక విషయాలు తెలిపారు. అయితే కేసును విచారించాలని ఏపీ హైకోర్టులో తిరుపతికి చెందిన వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు ఏసీబీ డీజీ, సీఐడీలకు అనుమతి ఇచ్చింది. అంతేకాదు లోక్ అదాలత్ లో రాజీ వ్యవహారంతో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులపైనా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. దీంతో రవికుమార్ ఆస్తులపై ఏసీబీ నివేదిక రెడీ చేసింది. శుక్రవారం జరిగిన విచారణలో రవికుమార్ ఆస్తులపై మధ్యంతర నివేదికను అధికారులు హైకోర్టుకు అందజేశారు.

Next Story