- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Good News:రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి వారు బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు!
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తుంది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం(CM Chandrababu) శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ(Andhra Pradesh)లోని డ్వాక్రా సంఘాల మహిళలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డ్వాక్రా సంఘాల మహిళల కోసం ఎన్డీయే కూటమి ప్రభుత్వం సరికొత్త యాప్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
డ్వాక్రా రుణాలు, పొదుపు డబ్బులు చెల్లించేందుకు ప్రతి నెలా మహిళలు బ్యాంకులకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడి అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు సర్కార్ ఓ యాప్ తీసుకురానుంది. ఈ యాప్ ద్వారా రుణాలు, పొదుపు డబ్బులు ఇంటి నుంచే చెల్లించవచ్చు. అంతేకాదు.. ఈ యాప్ అందుబాటులోకి వస్తే డ్వాక్రా సభ్యులు తమ రుణాల చెల్లింపు కోసం బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచే వాయిదాలు చెల్లించుకోవచ్చు. అంతేకాక యాప్ వినియోగం వల్ల డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించవచ్చు. దీనివల్ల నగదు బదిలీ మోసాలు తగ్గడమే కాకుండా సభ్యుల సమయం కూడా ఆదా అవుతుంది.






