- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల వేళ జనసేన అధిష్టానం కీలక ప్రకటన
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ఇప్పటికే ప్రకటించిన ఆయన ప్రచారంపై దృష్టి పెట్టారు. తాజాగా.. ప్రచారంపై జనసేన అధిష్టానం కీలక ప్రకటన చేసింది. పిఠాపురం నియోజకవర్గం నుంచే వారాహి వాహనంతో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు ఇవాళ జనసేన నేతలతో చర్చించి ఆయన షెడ్యూల్ ఖరారు చేశారు.
పిఠాపురంలో మూడు రోజుల పాటు వారాహి యాత్ర ఉంటుందని తెలిపారు. స్వయంగా అధినేత పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో అధికార వైసీపీ ఎన్నో పన్నాగాలు చేస్తోందని.. జనసైనికులంతా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. శక్తిపీఠం కొలువైన క్షేత్రం, శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పవిత్ర భూమి అయిన పిఠాపురం నుంచి ప్రచారం మొదలుపెట్టడం శుభప్రదమని పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. పురూహూతిక దేవికి పూజలు నిర్వహించి పవన్ వారాహి వాహనం నుంచి ఈ ప్రచారం ప్రారంభిస్తారు.






