- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూలిన భారీ రేకుల షెడ్డు.. సింహాద్రి అప్పన్న భక్తులకు తప్పిన ప్రమాదం
by Kema Shiva Kumar |
ప్రమాదాలకు కేరాఫ్‌గా సింహాద్రి అప్పన్న ఆలయం మారింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రమాదాలకు కేరాఫ్‌గా సింహాద్రి అప్పన్న ఆలయం మారింది. వివరాల్లోకి వెళితే.. చందనోత్సవ ఘటన మరువక ముందే ఆలయ ప్రాంగణంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. తొలిపావంచా వద్ద గిరి ప్రదక్షిణ కోసం వేసిన భారీ రేకుల ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే, పోల్స్ కింద కాంక్రీట్ వేయకపోవడంతో బరువు ఎక్కువై షెడ్డు కూలినట్లుగా అధికారులు నిర్ధారించారు. ప్రమాదం జరిగన సమయంలో ఆ రేకుల షెడ్డు కింద ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ నెల 9న గిరి ప్రదక్షిణ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇలా ప్రమాదం జరగడంతో ఆలయానికి రాబోయే భక్తులు ఏర్పాట్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఏప్రిల్ 30న సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా క్యూలైన్లలో ఉన్న భక్తులపై వర్షం కారణంగా గోడ కూలింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందగా మరో 15 మందికి గాయాలైన విషయం తెలిసిందే.
Next Story






