- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోడిని మింగిన భారీ కొండచిలువ.. జనం ఏం చేశారంటే..?
జనవాసాల్లో వచ్చి కోడిని మింగిన భారీ కొండచిలువను జనం కొట్టి చంపారు...

X
దిశ, వెబ్ డెస్క్: పాము పిల్లను చూస్తేనే భయాపడిపోతాం. అలాంటి 10 అడుగుల కొండచిలువ(Python) వస్తే ఇంకేముంది గుండె ఆగిపోవడమే. కానీ ధైర్యం చేసి కొట్టి చంపేశారు. ఈ ఘటన కడప జిల్లా(Kadapa District) కొండాపురం(Kondapuram)లో జరిగింది. సీఎంఆర్ కాలనీలో ఓ ఇంటి వద్ద కొండచిలువ ప్రత్యక్షం అయింది. అది సుమారు పది అడుగులు ఉంది. ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ కోడిపుంజును మింగుతోంది. ఆ సమయంలో స్థానికుల కంటపడింది. దీంతో ఒక్కసారిగా కర్రలతో కొండచిలువ తలపై దాడి చేశారు. దీంతో కొండచిలువ కోడిని వదిలిపెట్టింది. అయితే తీవ్ర గాయాలతో కొండచిలువ మృతి చెందిందని స్థానికులు తెలిపారు. కానీ నివాసాల వద్దకు రావడంతో తామంతా భయాందోళనకు గురయ్యామని తెలిపారు. మళ్లీ వస్తే ఏం జరుగుతుందోనని కొట్టామని పేర్కొన్నారు.
Next Story






