పొలాల్లో ప్రమాదకరమైన గిరినాగు హల్‌చల్.. చాకచక్యంగా బంధించారులా..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-01 08:47:01  IST  )

అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం పాత బొడ్డుపాడలో భారీ గిరినాగు కలకలం సృష్టించింది. స్థానిక వ్యవసాయ పొలాల్లో సుమారు 15 అడుగుల పొడవున్న ఈ పాము ఒక్కసారిగా ప్రత్యక్షమైంది...

పొలాల్లో ప్రమాదకరమైన గిరినాగు హల్‌చల్.. చాకచక్యంగా బంధించారులా..!
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalli District) దేవరపల్లి మండలం పాత బొడ్డుపాడ(PathaBoddupada)లో భారీ గిరినాగు(Girinagu) కలకలం సృష్టించింది. స్థానిక వ్యవసాయ పొలాల్లో(Fields) సుమారు 15 అడుగుల పొడవున్న ఈ పాము ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. పనుల నిమిత్తం వెళ్లిన స్థానిక రైతులకు కనిపించడంతో వారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ కృష్ణ(Snake Catcher Krishna)కు సమాచారం అందించారు. వెంటనే ఆయన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పంట పొలాల్లో నక్కిన గిరినాగును ఎంతో చాకచక్యంగా, సురక్షితంగా బంధించారు. అనంతరం స్నేక్ క్యాచర్ కృష్ణ ఆ గిరినాగును అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. వారి సమక్షంలో ఈ సర్పాన్ని ఎటువంటి హాని కలగకుండా సురక్షితంగా సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు. దీంతో రైతులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story