- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: విజయవాడ సమీపంలో భారీ అగ్నిప్రమాదం
by Vemula.Srinu Prasad |
విజయవాడ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది...

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ గోదాములో మంటలు భారీగా చెలరేగాయి. అంతేకాదు నల్లని పొగలు ఆ ప్రాంతమంతా భారీగా అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తోంది. అయితే పొగలు భారీగా అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గోదాములో ఎవరూ కార్మికులెవరూ లేనట్టుగా తెలుస్తోంది. ఆస్తి నష్టంపై అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో గోదాముల యాజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అగ్నిప్రమాదాల పట్ల కార్మికులకు ముందస్తు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అంతేకాదు ఫైర్ సెఫ్టీ పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని ఫైర్ సిబ్బంది తెలిపారు.
Next Story






