భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలు

by Malleboina Mahesh |

సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొని పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటన రాజమండ్రి దివాన్ చెరువులోని ఓ పండ్ల మార్కెట్‌లో చోటు చేసుకుంది.

భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలు
X

దిశ, వెబ్ డెస్క్: సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం (huge fire accident) చోటు చేసుకొని పెద్ద ఎత్తున మంటలు (fires) ఎగిసిపడ్డాయి. ఈ ఘటన రాజమండ్రి (Rajahmundry) దివాన్ చెరువులోని ఓ పండ్ల మార్కెట్‌ (Fruit market)లో చోటు చేసుకుంది. మార్కెట్ లోని పండ్లను స్టోర్ చేసేందుకు ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ (Cold storage godown) లో ఈ మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో భయభ్రాంతులకు గురైన కార్మికులు, రైతులు, వ్యాపారులు బయటకు పరుగులు తీశారు. అనంతరం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది (Fire crew) హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా వేగంగా మంటలు వ్యాప్తి చెందడంతో కోల్డ్ స్టోరేజ్ మొత్తం మంటల్లో చిక్కుకోని పోయింది. కోల్డ్ స్టోరేజ్ కావడంతో దట్టమైన పొగలు (Thick smoke) అలుముకోవడం తో ఆ ప్రాంతం మొత్తం పొగతో కమ్ముకొని పోయింది.

కాగా ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉండగా.. ఫైర్ సిబ్బంది (Fire crew) మంటలను అదుపు చేస్తున్నారు. అలాగే పక్కనే ఉన్న పండ్ల షాపుల (Fruit shops)కు మంటలు అంటుకోకుండా ఉండడానికి తగు చర్యలు తీసుకుంటున్నారు. కాగా వేసవి కావడంతో ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఎలాక్ట్రానిక్ (Electronic) పరికరాలను ఎక్కువగా ఉపయోగించే వారు.. వాటిని కూలింగ్ చేసే పలు చర్యలు తీసుకొవాలని అధికారులు సూచిస్తున్నారు. లేందంటే అవి హీటెక్కి.. ఇలాంటి అగ్నిప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం అధికంగా ఉందని చెప్పుకొస్తున్నారు. ప్రతి వేసవి (Every summer)లో ఇలాంటి అగ్నిప్రమాదాలు జురుగుతూనే ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

Next Story