పలాసలో ఘోర రోడ్డు ప్రమాదం .. హైవేపై పల్టీ కొట్టిన ఇన్నోవా కారు

by Vemula.Srinu Prasad |

శ్రీకాకుళం జిల్లా పలాసలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెమలి నారాయణపురం నేషనల్ హైవేపై ఇన్నోవా కారు పల్టీ కొట్టింది...

పలాసలో ఘోర రోడ్డు ప్రమాదం .. హైవేపై పల్టీ కొట్టిన ఇన్నోవా కారు
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) పలాస(Palasa)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. నెమలి నారాయణపురం నేషనల్ హైవే(Nemali Narayapuram National Highway)పై ఇన్నోవా(Innova Car) కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమం విషమంగా ఉంది. పర్లాఖిమిండి వాసులు పూరి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదం దృశ్యాలు స్థానిక సీసీ పుటేజ్‌లో రికార్డు అయ్యాయి. ఈదురుగాలులకు ఒక్కసారిగా కారు అదుపుతప్పినట్లు స్పష్టంగా వీడియోలో కనిపిస్తున్నాయి. హైవేపై వెళ్తూ డివైడర్‌ను ఢీకొని, అవతలి రోడ్డులో లారీని ఢీకొట్టి పక్కనున్న పొలాల్లోకి కారు దూసుకెళ్లింది. దీంతో స్థానికంగా భయనక వాతారవణం కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story