శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం.. బాలికపై అత్యాచారం!

by Thanuru Gopichand |

శ్రీ సత్యసాయి జిల్లాలో (Sri Satya Sai District) దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికపై అత్యాచారం (Molesting Girl) జరిగినట్లు తెలుస్తోంది.

శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం.. బాలికపై అత్యాచారం!
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ సత్యసాయి జిల్లాలో (Sri Satya Sai District) దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికపై అత్యాచారం (Molesting Girl) జరిగినట్లు తెలుస్తోంది. అయితే అత్యాచారానికి యత్నించింది కూడా మైనర్ కావడం ఆందోళనను కలిగిస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం కొత్త చెరువు మండలం పరిధిలో ఓ కుటుంబం నివసిస్తోంది. వారికి ఐదేళ్ల కుమార్తె ఉంది. బాలిక ఇంటి సమీపంలో ఆడుకుంటూ ఉంది. ఇంటి వద్ద ఉండగా అక్కడే సమీపంలో ఉండే ఒక 17 ఏళ్ల బాలుడు బాలిక వద్దకు వచ్చాడు. చాక్లెట్లు కొనిపిస్తానని నమ్మబలికాడు. అనంతరం ఐదేళ్ల చిన్నారిని తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక బాధతో ఉండగా తల్లి గమనించి ప్రశ్నించింది. బాలిక నుంచి సమాధానం విని ఆందోళనకు గురైంది. తన కుమార్తెపై అత్యాచారం జరిగిందని తెలుసుకొని ఆవేదనకు గురైంది. విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు కూడా ఆందోళనకు గురయ్యారు. చిన్నారిపై అత్యాచారం చేయడం ఏమిటని విస్మయాన్ని వ్యక్తం చేశారు. దుర్ఘటన నుంచి తేరుకున్న బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తమ బిడ్డకు జరిగిన ఘోరం గురించి పోలీసుల ముందు మొరపెట్టుకున్నారు. అఘాయిత్యానికి పాల్పడిన బాలుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చికిత్స నిమిత్తం బాలికను అనంతపురంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.

ఈ అమానవీయ ఘటనపై పౌర సమాజం మండి పడుతోంది. ఇటువంటి దురాగతాలకు సినిమాలు, అశ్లీల సైట్లు, సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్ కారణమంటూ విమర్శలు గుప్పిస్తోంది. విద్యార్థి దశలోనే సత్ర్పవర్తనను అలవరిస్తే ఇటువంటి దారుణాలను నియంత్రించవచ్చనే అభిప్రాయాన్ని పౌర సమాజం వ్యక్తం చేస్తోంది. అయితే సత్ప్రవర్తనకు బీజం ఇంటి నుంచి పడాలని, పాఠశాలల్లో పెరగాలని సూచిస్తోంది. మార్కులు, ర్యాంకుల పోటీతో పాటు నైతిక విలువలకు కూడా ప్రాధాన్యం లభించాలని స్పష్టం చేస్తోంది.

Next Story