కూలిపోయిన వంతెన.. తెగిపోయిన సంబంధాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-30 10:21:27  IST  )

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది...

కూలిపోయిన వంతెన.. తెగిపోయిన సంబంధాలు
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) భీమవరం(Bhimavaram) సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. దొంగపిండి గ్రామం వద్ద ఇసుక లారీ(Sand Lorry) వెళ్తుండగా బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో లారీతో సహా బ్రిడ్స్ కుంగిపోయింది. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్(Driver) తృటిలో తప్పించుకున్నారు. ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

పూర్తిగా నిలిచిపోయిన రవాణా సౌకర్యాలు

అయితే ఈ బ్రిడ్జి కూలిపోవడంతో దొంగపిండి గ్రామానికి రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామస్థులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో రాకపోకలు సాగించేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకే ఈ మార్గమే ఉండటంతో నిత్యావసరాలు, అత్యవసర వైద్య సేవల కోసం నానా పాట్లు పడుతున్నారు.

ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో..

గ్రామానికి ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులు వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా గ్రామానికి రవాణా సౌకర్యాన్ని పునరుద్ధరించాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.

Next Story