తోటపల్లి వద్ద ఏనుగుల గుంపు హల్ చల్

by Thanuru Gopichand |

పార్వతీపురం మన్యం జిల్లాలోని గురుగుబిల్లి మండలం పరిధిలో ఉన్న తోటపల్లి (Thotapally) వద్ద ఏనుగుల గుంపు హల్ చల్ చేసింది.

తోటపల్లి వద్ద ఏనుగుల గుంపు హల్ చల్
X

దిశ, వెబ్ డెస్క్ : పార్వతీపురం మన్యం జిల్లాలోని గురుగుబిల్లి మండలం పరిధిలో ఉన్న తోటపల్లి (Thotapally) వద్ద ఏనుగుల గుంపు హల్ చల్ చేసింది. ఏనుగులు (Elephants) రోడ్డు పైకి రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇదే ప్రాంతంలోని తామరచెరువు వద్ద ఏనుగులు హడావుడి చేశాయి. మరోసారి ఏనుగులు కనిపించడంతో కలకలం రేగింది. ఏనుగుల సంచారం కారణంగా పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.ఇదే ప్రాంతంలో సంచరించిన ఏనుగులు మళ్లీ తిరిగి రావడంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. సంచరించిన మార్గాల్లోనే తిరుగుతూ పంటలను ధ్వంసం చేస్తున్నాయని వాపోతున్నారు. ఏళ్ల తరబడి ఏనుగులు అడవిని విడిచి గ్రామీణ ప్రాంతాల్లో తిరగడం వల్ల తామెంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. సంబంధిత అటవీశాఖ అధికారులు దృష్టి సారించాలని.. ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. వాటి కారణంగా నష్టం వాటిల్లిన పంటలకు నేటికీ ఎటువంటి పరిహారం అందించలేదని, దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తమకు తగిన న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story