- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన్యం జిల్లాలో గజరాజుల హల్‌చల్
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చేసింది. అటవీ ప్రాంతం వదిలి జనవాసాల్లోకి సంచరిస్తున్నాయి..

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లా(Manyam District)లో ఏనుగుల(Elephant) గుంపు హల్ చేసింది. అటవీ ప్రాంతం(Forest Department) వదిలి జనవాసాల్లోకి సంచరిస్తున్నాయి. జియ్యమ్మవలస మండలం సింగనాపురం(Singnapuram)లోకి తాజాగా చొరబడ్డాయి. ఏనుగుల గుంపు ఒక్కసారిగా ఊరి మధ్యలో ప్రత్యక్షం కావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. దీంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
గ్రామంలోకి ప్రవేశించి బీభత్సం
కాగా అడవి నుంచి రాత్రి సమయంలో గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగులు వీధుల గుండా వెళ్తూ బీభత్సం సృష్టించాయి. గ్రామ సమీపంలోని పంట పొలాలను తొక్కుకుంటూ వెళ్లాయి. దీంతో గిరిజనులు గజగజ వణికిపోయారు. ఏ క్షణంలో ఏనుగులు దాడి చేస్తాయోనన్న భయంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకిపోతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు ప్రాణ భయంతో గగ్గోలు పెడుతున్నారు. గజరాజుల తాకిడి నుంచి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని, పంట నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరారు.
రంగంలోకి దిగిన అధికారులు
అయితే అటవీశాఖకు అందించిన సమాచారంలో అధికారులు రంగంలోకి దిగారు. ఏనుగుల సంచారాన్ని పరిశీలించారు. ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏనుగులను రెచ్చగొట్టొద్దని గ్రామస్తులకు సూచనలు చేశారు.






