గంగమ్మ జాతరలో హెలికాప్టర్‌ కలకలం.. పరుగులు తీసిన భక్తులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-26 13:30:27  IST  )

పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతరలో హెలికాప్టర్ కలకలం రేపింది....

గంగమ్మ జాతరలో హెలికాప్టర్‌ కలకలం.. పరుగులు తీసిన భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా పుంగనూరు(Punganuru)లో సుగుటూరు గంగమ్మ జాతర(Sugutur Gangamma Jathara) జరుగుతోంది. అయితే జాతర సాగుతున్న సమయంలో టీడీపీ నేత అర్వేటిబాబు(TDP leader Arveti Babu) చేసిన పని రచ్చ రచ్చ అయింది. గంగమ్మ ఆలయంపై హెలికాప్టర్‌తో ఆకాశం నుంచి పూలు చల్లించారు. అయితే హెలికాప్టర్(Helicopter) కిందకు రావడంతో గాలి దుమారం చెరేగింది. దీంతో భక్తులు కోసం వేసిన టెంట్లు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. అంతేకాదు దుమ్ము, ధూళి రేగింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ వైపు ఎండ, మరోవైపు కళ్లలో దుమ్ము, ధూళి పడటంతో భక్తులు అవస్థలు పడ్డారు. కొంతమంది భక్తులు దూరంగా పరుగులు తీశారు. అయితే ఈ ఘటనపై భక్తులు అసనహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత అర్వేటిబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగమ్మ జాతరలో అతిశయోక్తి ప్రదర్శించడంపై మండిపడ్డారు.

మరోవైపు మంగళవారం ప్రారంభమైన సుగుటూరు గంగమ్మ జాతర నేటి రాత్రితో ముగియనున్నాయి. రెండు రోజుల పాటు ఈ జాతర ఎంతో వైభవంగా సాగుతుంది. అమ్మవారికి దివ్వెలు, జంతుబలులతో భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు.

Next Story