ఏపీ హైకోర్టులో లిక్కర్‌ కేసు... సిట్ తరపున సిద్ధార్థ లుథ్రా వాదనలు

by Vemula.Srinu Prasad |

లిక్కర్‌ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది...

ఏపీ హైకోర్టులో లిక్కర్‌ కేసు... సిట్ తరపున సిద్ధార్థ లుథ్రా వాదనలు
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్‌ కేసు(Liquor Case)పై ఏపీ హైకోర్టు(Ap High Court)లో విచారణ జరిగింది. అయితే ఈ కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు(Acb Court) బెయిల్ మంజూరు చేయడంపై సిట్‌(SIT) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ధర్మాసనం ఎదుట విచారణ కొనసాగింది. సిట్‌ తరుఫున సిద్ధార్థ లుథ్రా(Siddhartha Luthra) వాదనలు వినిపిస్తున్నారు. నిందితులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్పలకు బెయిల్‌ ఇస్తూ.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం చట్ట విరుద్ధమని వాదనలు వినిపించారు. ఆగస్టు 11న ముగ్గురు నిందితుల పాత్ర వివరిస్తూ సిట్‌ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. అటు నిందితుల తరపున కూడా వాదనలు వినిపిస్తున్నారు. చివరి వరకు వాదనలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

Next Story