నల్లమలసాగర్‌పై రేపే విచారణ.. లీగల్‌ టీమ్‌కు ప్రభుత్వం కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-11 13:03:03  IST  )

పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు నిర్మాణంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది..

నల్లమలసాగర్‌పై రేపే విచారణ.. లీగల్‌ టీమ్‌కు ప్రభుత్వం కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు(Polavaram-Nallamalasagar Link Project) నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) సుప్రీంకోర్టు(Supreme Court)లో అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం వద్ద సోమవారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ జల వనరుల శాఖ అలర్ట్ అయింది. అధికారులతో అమరావతిలో ఆదివారం సమీక్షించిన మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) లీగల్ టీమ్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రం తరపున బలంగా వాదనలు వినపించాలని చెప్పారు.

లీగల్ టీమ్‌కు రికార్డులు

కేసు రికార్డులన్నీ లీగల్ టీమ్‌కు అందించాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి సూచించారు. ప్రతి సంవత్సరం వరద జలాలు 3 వేల టీఎంసీలు సముద్రంలోకి వృథాగా పోతున్నాయని, అందులో నుంచి 200 టీఎంసీలను దిగువ రాష్ట్రమైన ఏపీ వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ధర్మాసనాన్ని అభ్యర్థించాలని చెప్పారు. గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ ప్రకారం మిగులు జలాలు వాడుకునే హక్కు రాష్ట్రానికి ఉందని ధర్మాసనం ఎదుట వాదించాలని తెలిపారు. సముద్రంలోకి వృథాగా పోతున్న నీటితో రాయలసీమను సస్యశామలంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్ ఫీజులబులిటీ రిపోర్టును ఇప్పటికే కేంద్రానికి సమర్పించిన విషయాన్ని ధర్మాసనం ఎదుట వివరించాలన్నారు. డీపీఆర్ టెండర్లు కేవలం సన్నాహక చర్యలు మాత్రమేనని, అనుమతుల ప్రకారమే ప్రాజెక్టును నిర్మిస్తామని సుప్రీంకోర్టు ఎదుట వాదనలు వినిపించాలని లీగల్ టీమ్‌కు మంత్రి నిమ్మల సూచించారు.

Next Story