- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: గుంతలో సగం కాలిన మృతదేహం.. ఎవరిదో..?
విశాఖలో సగం కాలిన మృతదేహం కలకలం రేపింది..

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో సగం కాలిన మృతదేహం(Dead Body) కలకలం రేపింది. 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పెందుర్తినరవ(Pendurtinarava) సమీపంలోని ఓపెన్ ప్లేస్‌లోని ఓ గుంతలో అనుమానాస్పద స్థితిలో పడి ఉంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఘటన స్థలాన్ని క్లూస్ టీమ్‌తో పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. హత్య చేసి పడేసినట్లుగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. స్థానికంగా నమోదైన మిస్సింగ్ కేసులపై దృష్టి పెట్టారు. ఈ మృతదేహం ఎవరిదనేది త్వరలో తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు.
కాగా ఇలాంటి ఘటన ఇంతకుముందు కూడా జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఓపెన్ ప్రాంతాల్లో రాత్రి సమయంలో కొంతమంది యువకులు మద్యం తాగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఇకనుంచైనా మరింత నిఘా పెట్టాలని అంటున్నారు.






