కోనసీమ జిల్లాలో విషాదం: గోదావరిలో గల్లంతైన ముగ్గురిలో ఒకరి మృతి

by Vemula.Srinu Prasad |

కోనసీమ జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం నెలకొంది. పిచ్చుకలంక వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు....

కోనసీమ జిల్లాలో విషాదం: గోదావరిలో గల్లంతైన ముగ్గురిలో ఒకరి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కోనసీమ జిల్లా(Konasima District)లో ఆదివారం తీవ్ర విషాదం(Tragedy) నెలకొంది. పిచ్చుకలంక వద్ద గోదావరి నది(Godavari River)లో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. రాజమండ్రి జాంపేట(Rajahmundry Jampet)కు చెందిన మహమ్మద్‌ (18), షేక్ సుల్తాన్ (22), షేక్ బిలాల్ (29) గోదావరి నదిలోకి దిగి ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు ముమ్మరం చేశారు. చేతికి అందొచ్చిన కొడుకులు కళ్లముందే నీట మునిగిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

లోతు తెలియకుండా నీటిలోకి దిగవద్దు

నదీ తీరాల్లో లోతు తెలియకుండా నీటిలోకి దిగవద్దని అధికారులు చెబుతున్నా ఇలాంటి విషాద సంఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సెలవు దినాల్లో యువత విహారయాత్రల పేరుతో అక్కడికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక నైనా సముద్రం, చెరువులు, కాలువలు, వ్యవసాయ బావుల్లో ఈతకు వెళ్లే సమయంలో సరైన జాగ్రత్తలు పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Next Story