ఏపీలో తీవ్ర విషాదం.. గోదావరిలో 8 మంది యువకులు గల్లంతు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-26 12:24:08  IST  )

ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మమ్మడివరం దగ్గర గోదావరిలో 8 మంది గల్లంతయ్యారు. గోదావరిలో స్నానానికి వచ్చి యువకులు గల్లంతైనట్టు తెలుస్తోంది.

ఏపీలో తీవ్ర విషాదం.. గోదావరిలో 8 మంది యువకులు గల్లంతు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ముమ్మడివరం దగ్గర గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. గోదావరిలో స్నానానికి వచ్చి యువకులు గల్లంతైనట్టు తెలుస్తోంది. వారు కాకినాడ, రామచంద్రాపురం, మండపేట యువకులుగా గుర్తించారు. గల్లంతైన వారిలో క్రాంతి, పాల్, సాయి, మహేష్, సతీష్, రాజేష్, రోహిత్ ఉన్నారు. వీరంతా ఓ శుభకార్యానికి వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం పదకొండు మంది గల్లంతవ్వగా వారిలో ముగ్గురిని స్థానికులు రక్షించారు. ప్రస్తుతం మిస్సైన యువకుల కోసం పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు.

Next Story